నాంపల్లిలో శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి
NLG: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నాంపల్లి పట్టణ కేంద్రంలో శనివారం శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయం రంగురంగుల విద్యుత్ కాంతులతో అద్భుతంగా ముస్తాబయింది. ఆదివారం సామూహిక రుద్రహోమం, పూర్ణాహుతి, రాత్రి 7 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి, పూజారులు, కమిటీ సభ్యులు తెలిపారు.