VIDEO: ఉగాది రోజు నాగలి.. పంటల సమృద్ధి అని నమ్మకం..!
GDWL: గట్టు మండలంలో ఉగాది పండుగను కొత్త దినంగా జరుపుకుంటారు. తెల్లవారుజామునే రైతులు, యువకులు తమ పాడి పశువులను ముస్తాబు చేసి పొలాలకు తరలివెళ్లారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఎవరికి గ్రహబలం ఎక్కువగా ఉంటుందో, ఆ యువకులతో ఎద్దుల సహాయంతో పొలాన్ని చదును చేయించారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం.