జిల్లాలో స్పార్క్ పేరుతో అవగాహన సదస్సులు నిర్వహిస్తాం: మంత్రి
VZM: యువతను వ్యాపార రంగంలో ముందుకు తీసుకువెళ్లడానికి కూటమి ప్రభుత్వం స్పార్క్ పేరుతో అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. గురువారం మంగళగిరి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యాలయంలో 'స్పార్క్' కార్యక్రమాన్ని ఆయన RTIH సీఈవో పి. ధాత్రి రెడ్డి (IAS)తో కలిసి ప్రారంభించారు.