VIDEO: మహిళపై బస్సు కండక్టర్ దురుసు ప్రవర్తన
రాయచోటి బంగ్లా వద్ద ఆర్టీసీ బస్సు కండక్టర్ ఒకరు మహిళా ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. బస్సు నిలపమని అడగడంతో మాటల తగవు చోటుచేసుకుని కండక్టర్ అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. ఘటనపై విచారణ చేసి బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.