ఆదర్శ రైతుకు జేసీ అభినందన
VZM: గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లిలో జేసీ సేదుమాధవన్ బుధవారం పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఆదర్శ రైతు జగన్నాధరాజు సాగు చేస్తున్న టమాటా తోటను ఆయన పరిశీలించారు. ఆధునిక విధానాలను అవలంబిస్తూ అత్యధిక దిగుబడి సాధించినందుకు రైతును జేసీ అభినందించారు. ఇందులో ఉద్యానశాఖ డీడీ చిట్టిబాబు, తహసీల్దార్ నీలకంటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.