ఒంగోలు మేయర్ ఆగ్రహం ?
ప్రకాశం: ఒంగోలు మేయర్ గంగాడ సుజాతకు కోపమొచ్చింది. నేడు మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒంగోలులో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రులు సైతం హాజరవుతున్నారు. విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన శిలాఫలకంపై మేయర్ సుజాత పేరు లేకపోవడం, అలాగే ఆహ్వాన పత్రికలో సైతం ఆమె ఉచ్చారణ లేకపోవడంతో మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.