అధికారుల నిర్లక్ష్యం.. చినిగిపోయిన జవాబు పత్రాలు

WGL: వరంగల్ జిల్లాలోని పదవ తరగతి జవాబు పత్రాలను ఖమ్మం జిల్లాకు తరలించే క్రమంలో బస్తా చినిగిపోవడంతో పత్రాలు నిలిచిపోయాయి. జవాబు పత్రాలు డ్యామేజ్ అయితే మూల్యాంకనంలో విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.