రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా ఉమ్మడి జిల్లా జట్టు

ADB: మందమర్రి సింగరేణి మైదానంలో గత మూడు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ పోటీలు ముగిశాయి. ఫైనల్స్‌లో రంగారెడ్డి జిల్లా జట్టుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు గెలుపొంది గోల్డ్ మెడల్ సాధించింది. గెలుపొందిన జట్లకు ఆ సంఘ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్యామల పవన్ కుమార్, జిల్లా ప్రధానకార్యదర్శి కనపర్తి రమేశ్ బహుమతులు ప్రదానం చేశారు.