నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KRNL: మద్దికెర సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ రఫీక్ వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ సిబ్బంది అందుబాటులో వుంటారన్నారు.