భాకరాపేటలో నడివీధి గంగమ్మ జాతర
KDP: సిద్ధవటం మండలం భాకరాపేటలో వెలసిన నడివీధి గంగమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈనెల 19న ఆదివారం వైభవంగా నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా.. అమ్మవారికి అభిషేకాలు, బోనాలు, పలు కార్యక్రమాలు ఉంటాయన్నారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని గ్రామ పెద్దలు తెలియజేశారు.