అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచిన వ్యక్తికి జైలు శిక్ష

అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచిన వ్యక్తికి జైలు శిక్ష

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచిన యజమానికి ఒక రోజు జైలుశిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చినట్లు ఐదవ టౌన్ ఎస్సై గంగాధర్ గురువారం తెలిపారు. బాబన్ సాహెబ్ పహాడ్‌కు చెందిన అబ్దుల్ హఫీ అర్ధరాత్రి వరకు టీ పాయింట్ తెరిచి ఉంచాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.