సముద్రంలో భరతనాట్యం చేసిన చిన్నారి
తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 11 ఏళ్ల చిన్నారి సముద్రంలో 20 అడుగుల లోతులో భరతనాట్యం చేసింది. భారతీయ సంస్కృతిని కొత్త కోణంలో చూపించడమే తన ఉద్దేశమని తెలిపింది. అందుకే సముద్రంలో నాట్యం చేసినట్లు చెప్పింది. ప్రస్తుతం చిన్నారి డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.