జిల్లాకు మరో రెండు సబ్ స్టేషన్లు మంజూరు

జిల్లాకు మరో రెండు సబ్ స్టేషన్లు మంజూరు

SRCL: సిరిసిల్ల జిల్లాకు మరో రెండు 33/11 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేశామని సిరిసిల్ల సూపర్డెంట్ ఇంజనీర్ బిక్షపతి తెలిపారు. సిరిసిల్లలోని విద్యుత్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లికు ఒకటి, గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు మరో సబ్ స్టేషన్ మంజూరు చేశామన్నారు. దీంతో విద్యుత్ సరఫరా మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు.