'నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి'

NDL: కార్మికులను కట్టు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం జూపాడు బంగ్లా మండల కేంద్రంలో లిబరేషన్, ఏఐటీయూసి నాయకుల సమావేశం నాయకులు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా నాయకులు నరసింహ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఏఐటీయూసి, సీపీఐ(ఎం.ఎల్) లిబరేషన్ నాయకులు పాల్గొన్నారు.