కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో భోజనం

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో భోజనం

TPT: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ వెంకటగిరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల ఆంగ్ల ప్రావీణ్యం, ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తూ వారిని ప్రోత్సహించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.