వదంతులు నమ్మకండి: ఏసీపీ

HYD: ఇండియా, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వచ్చే వదంతులను నమ్మొద్దని ఏసీపీ బాలనాగిరెడ్డి కోరారు. ఎస్ఆర్ నగర్ PS పరిధిలో ఉన్న దేవాలయాలు, చర్చీలు, మసీదు కమిటీల నిర్వాహకులతో ఏసీపీ సమావేశం నిర్వహించారు. ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్ ఉన్నారు.