ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐపీఎల్ టికెట్లు
కర్ణాటకలోని అధికార పార్టీ MLAలు పంతం నెగ్గించుకున్నారు. IPL టికెట్లు కొనడానికి క్యూలో నిలబడేందుకు నిరాకరించిన MLAలు ఉచితంగా టికెట్లు పొందనున్నారు. KSCA అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ సీఎం సిద్ధరామయ్యను కలిసి ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ప్రతీ మ్యాచులకు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక్కొక్కరికి 3 టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.