ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ELR: జంగారెడ్డిగూడెం SDS ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సర అడ్మిషన్లు ఇవాళ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ బి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి ప్రవేశాలు మొదలై జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. ఈ నెల 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈ నెల 23 వరకు తరగతులు కొనసాగుతాయన్నారు.