గ్యాస్ గోడౌన్ తనిఖీ చేసిన తహశీల్దార్
KRNL: గ్యాస్ సరఫరాపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మాధురి భారత్ గ్యాస్ ఏజెన్సీ గోడౌన్‌ను పెద్ద కోడూరు మండల తహసీల్దార్ గీత ప్రియదర్శిని ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా స్టాక్ రిజిస్టర్లు పరిశీలించి సూచనలు జారీ చేశారు. గ్యాస్ సరఫరాపై మళ్లీ ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు.