కరెంటు షాక్‌తో ఎలక్ట్రిషియన్‌కు తీవ్ర గాయాలు
అన్నమయ్య: మదనపల్లి మండలంలో ఆదివారం ఎలక్ట్రిషియన్ మహబూబ్ జానీ (38) కొత్తపల్లిలో ఒక ఇంటికి యాంటెన్నా అమర్చేందుకు వెళ్లగా విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయిన ఆయనను స్థానికులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.