చిత్తూరు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్

CTR: కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ప్రారంభించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో నిజమైన ఫేస్ బుక్ ఖాతా నుంచి అలెర్ట్ మెసేజ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మేరకు గురువారం కలెక్టర్ తన ఒరిజినల్ ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అత్యవసర సమాచారం అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు.