'మా ఊరి వెంకన్న' చిత్రానికి అవార్డు
AKP: ఇటీవల విడుదలైన 'మా ఊరి వెంకన్న' చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును అందుకుంది. చిత్ర దర్శకుడు కోరుకొండ గోపి ఈ విషయాన్ని సోమవారం తెలియజేశారు. ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో నిర్మాత కోటేశ్వర శర్మకు ఉత్సవం డైరెక్టర్ దిలీప్ కుమార్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించారు.