పొగాకు రైతులకు శుభవార్త

ప్రకాశం: పొగాకు రైతులకు ఒంగోలు పొగాకు వేలం నిర్వహాణ అధికారి తులసి ఆదివారం ఒక ప్రకటనలో శుభవార్త చెప్పారు. ఒంగోలు పొగాకు వేలం కేంద్రం-2లో పొగాకు బ్యారెన్లకు ఈనెల 18 నుంచి రిజిస్ట్రేషన్ లు ప్రారంభమవుతాయని చెప్పారు. పొగాకు బ్యారేన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మూడేళ్లకు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసే పద్ధతిని రైతులు గమనించాలని కోరారు.