VIDEO: వేదమంత్రాలతో బసవేశ్వరునికి పంచామృతాభిషేకం

NDL: మహానంది పుణ్య క్షేత్రంలోని గర్భాలయం ముందు వెలసిన బసవేశ్వర స్వామి వారికి వేదమంత్రాలతో పంచామృత అభిషేకాలను నిర్వహించారు. బుధవారం శ్రావణ బహుళ త్రయోదశిని పురస్కరించుకొని వేద పండితులు బ్రహ్మశ్రీ రవిశంకర అవధాని, నాగేశ్వర శర్మల వేదమంత్రాలతో స్వామివార్లకు గణపతి పూజ, విశేష ద్రావ్య పంచామృత అభిషేకాలను నిర్వహించి, అలంకారాలతో భక్తులకు దర్శనం కల్పించారు.