పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్

GNTR: జీఎంసీ పరిధిలోని ప్రజారోగ్య విభాగం అధికారులు ప్రతిరోజూ మధ్యాహ్నం డ్రైన్‌లు శుభ్రం చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గుంటూరు నగరంలో అమరావతి రోడ్డు, రెడ్డిపాలెం, నాయుడు పేట, విద్యానగర్ ప్రాంతాల్లో మంగళవారం కమిషనర్ పర్యటించారు. కాలువలో నిల్వ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించి కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.