చందంపేటలో నేడు ఎమ్మెల్యే బాలునాయక్ పర్యటన

NLG: చందంపేట మండలంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఇవాళ పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 7 గంటలకు చందంపేట మండల కేంద్రంలో 'జనహిత - ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్' కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.