'పరకామణి చోరీ.. దోషులకు శిక్ష పడాల్సిందే'

'పరకామణి చోరీ.. దోషులకు శిక్ష పడాల్సిందే'

AP: తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణపై టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చానని తెలిపారు. అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పానని వెల్లడించారు. పరకామణి చోరీ తప్పే.. దోషులకు శిక్ష పడాల్సిందేనన్నారు. తాను టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడే చోరీ జరిగినా.. అప్పుడు తెలియలేదని పేర్కొన్నారు.