రేపు ఈ గ్రామాల్లో పవర్ కట్

KMM: మధిర మండలం సిరిపురం సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ ఎస్. మైథిలి తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని సిరిపురం, రొంపిమల్ల, మల్లారం, జాలిముడి, రామచంద్రాపురం గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.