నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

SRD: జిల్లాలో ఈ నెల 4న జరిగే నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వల్లూరు ప్రాంతీయ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏడు పరీక్ష కేంద్రాలు 3,320 మంది అభ్యర్థుల పరీక్ష రాస్తున్నారని చెప్పారు. మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత పరీక్షా కేంద్రానికి వస్తే అనుమతించమని చెప్పారు.