డ్రగ్ పార్టీపై ఎస్ఓటీ పోలీసుల దాడులు

డ్రగ్ పార్టీపై ఎస్ఓటీ పోలీసుల దాడులు

HYD: గచ్చిబౌలిలో డ్రగ్ పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కోలివింగ్ గెస్ట్ రూంలో డ్రగ్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ యువకులకు అమ్ముతున్నారు. డ్రగ్స్ సప్లయర్ తేజకృష్ణతో పాటు మరో నైజీరియన్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.