ఈ నెల 10 వరకు దరఖాస్తులకు అవకాశం: ఎంఈవో
NDL: ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులు ఒకటో తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ చివరి అవకాశం ఉందని గురువారం చాగలమర్రి ఎంఈవో న్యామతుల్లా తెలిపారు. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉందన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు లాటరీ పద్ధతి ద్వారా సీట్లు కేటాయిస్తామన్నారు.