NTR ఉచిత ఆరోగ్య రథం ద్వారా వైద్య సేవలు
CTR: పుంగనూరు పట్టణంలో NTR ఉచిత ఆరోగ్య రథం ద్వారా ప్రజలకు డాక్టర్లు వైద్య సేవలు అందించారు. సోమవారం స్థానిక ఇందిరా కూడలిలో ఈ వాహనాన్ని ఏర్పాటు చేశారు. పట్టణానికి విచ్చేసిన వివిధ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. బీపీ, షుగర్, ఇలా వివిధ రకాల వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.