సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఎమ్మెల్యేల ఘన స్వాగతం
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండల కేంద్రంలో నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం కోసం భారీగా ప్రజలు తరలివచ్చి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.