బాల్య వివాహం అడ్డగింత.. కేసు నమోదు
WNP: చందాపూర్ గ్రామంలో జరుగుతున్న బాల్య వివాహాన్ని ICDS అధికారులు అడ్డుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు ICDS అధికారి భారతి తన సిబ్బందితో కలిసి వివాహాన్ని నిలిపివేశారు. ఈ ఘటనపై అమ్మాయి తల్లిదండ్రులు, వరుడు, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా ఎస్సై రిషికేష్ కేసు నమోదు చేశారు. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని తెలిపారు.