ఘనంగా వీర గున్నమ్మ వర్ధంతి వేడుకలు
SKLM: వీర గున్నమ్మ 86వ వర్ధంతి సందర్భంగా బుధవారం మందస మండలం వీర గున్నమ్మపురం స్థూపం వద్ద రాష్ట్ర రైతు, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వతంత్ర ఉద్యమంలో భాగంగా మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో వీర గున్నమ్మ పోరాటం ఎనలేనిదని గుర్తు చేశారు.