'విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు'
ADB: జిల్లాలోని 6 మండలాలలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలో నిర్వహించరాదని ASP కాజల్ సింగ్ గురువారం తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలను నిర్వహించిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని హెచ్చరించారు. సంబంధిత అధికారుల వద్ద సరైన నిర్దేశిత రోజున అనుమతులు తీసుకుని ర్యాలీలను నిర్వహించాలని సూచించారు.