'జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం'
కడప: చెన్నూరులో ఆదివారం వైసీపీ గ్రామ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ZPTC దిలీప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. 2029లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.