ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే
ADB: జిల్లాలో కొనసాగుతున్న 6వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బోజ్జు పటేల్ తన ఓటు హక్కును ఉట్నూర్ మండల కేంద్రంలో గురువారం వినియోగించుకున్నారు. ప్రజలందరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ద్వారా తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరారు.