విద్యార్థులతో భోజనం చేసిన ఎమ్మెల్యే

విద్యార్థులతో భోజనం చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఏపీ ఉత్తమ పాఠశాలగా ఇటీవల సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న గుడ్లవల్లేరు మండలంలోని అంగులూరు బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం పాఠశాలలో ఎమ్మెల్యే రాము భోజనం చేసి, విద్యార్థులతో కాసేపు మాట్లాడారు.