'18 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు'
సంగారెడ్డి జిల్లాలో ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. 18, 19 తేదీల్లో ప్రాథమిక ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రోజుకు 50 శాతం చొప్పున ఉపాధ్యాయులు హాజరుకావాలని పేర్కొన్నారు. 21, 23 తేదీల్లో ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు జరుగుతాయన్నారు.