అది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం: జగదీష్ రెడ్డి
TG: HILT ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. 9,300 ఎకరాల స్థలం విలువ రూ.10 లక్షల కోట్లు ఉందని అన్నారు. జీవో విడుదల చేసిన విషయం ఆ శాఖ మంత్రికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎవరికీ చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నాన్ పొల్యూషన్ సంస్థలను కూడా తరలిస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ దందా చేయబోతున్నారని దుయ్యబట్టారు.