ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలి: కౌశిక్ రెడ్డి
KNR: హుజూరాబాద్ మండలం రాంపూర్ శివారులో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నేలకొరిగిన వరి పంటలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 1,15,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వ్యవసాయాధికారులు పూర్తిస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు. నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.