'బీటీపి ఆయకట్ట రైతన్నలకు సాగునీరు అందిస్తాం'

ATP: గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ ఆయకట్ట రైతన్నలకు డిసెంబర్లో సాగునీరును అందిస్తామని ప్రభుత్వ విప్ కాలువ సూచించారు. సంబంధిత అధికారులతో కలిసి ఆయన సోమవారం భైరవాణి తిప్ప ప్రాజెక్టును సందర్శించారు. డిసెంబర్లో నీటిని విడుదల చేయడానికి రైతన్నలను సమాయత్తం చేస్తామన్నారు. అవకాశాన్ని బట్టి చెరువులకు కూడా నీటిని అందిస్తామని స్పష్టం చేశారు.