చిన్నారిని లాలించిన పోలీస్ కానిస్టేబుల్ సుష్మా
MHBD: నరసింహులపేట మండల కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన చంటి పిల్ల తల్లికి అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సుష్మా చంటి పిల్లను ఎత్తుకొని కాసేపు లాలించారు. ఈ సమయంలో చిన్నారి తల్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానిస్టేబుల్ చంటి పిల్లను లాలించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.