VIDEO: 'రోడ్డు వేయకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం'
MDK: వెల్దుర్తి మండల కేంద్రానికి రోడ్డు బాగు చేయకుంటే తాము స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తామని స్థానిక ప్రజలు తేల్చి చెప్పారు. మండల పరిధిలోని శెట్టిపల్లి కలాన్ వద్ద రామాయపల్లి, బండ పోచంపల్లి, ఏదులపల్లి గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. మెదక్-వెల్దుర్తి ప్రధాన రహదారి రెండు వరుసలుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.