గుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లా: కలెక్టర్ పమేలా సత్పతి చొప్పదండి నియోజకవర్గం గుండి గ్రామంలోని ప్రాథమిక ఆసుపత్రిని సందర్శించారు.. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... నార్మల్ డెలివరీలను ఎక్కువగా ప్రోత్సహించాలని అలాగే పోషకాహారం పై మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.