ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దివ్య రాజీనామా
KMR: బిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దివ్య తన ఉద్యోగానికి మంగళవారం రాజీనామా చేశారు. కాంట్రాక్టు పద్ధతిపై ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాదిగా ఆమెకు వేతనాలు సక్రమంగా రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో తన వైద్యాధికారి ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు.