వెంకటసాయి నగర్ కాలనీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కమిటీ
MDCL: రామంతపూర్ పరిధి వెంకటసాయి నగర్ కాలనీలో బీరప్ప దేవాలయంలో కాలనీ ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. కాలనీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. నామినేషన్ల దాఖలు 15 మార్చి 2026, ఉపసంహరణ 18 మార్చి, పోలింగ్ 22 మార్చి నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు రూ.25,000 డిపాజిట్ నిర్ణయించారు.