తిరుపతి నగరపాలక ప్రజా ఫిర్యాదుల వేదికకు 41 వినతులు
TPT: తిరుపతి నగరపాలక సంస్థలో ప్రజా ఫిర్యాదుల వేదికకు 41 వినతులు అందాయి. 36 మంది ప్రత్యక్షంగా, 5 మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలిపారు. త్రాగునీరు, చెత్త, రోడ్లు, ఆక్రమణలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కమీషనర్ ఎన్. మౌర్య సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించనున్నారు.