కలెక్టరేట్‌లో మత్స్యకారుల సంక్షేమంపై సమీక్ష
నెల్లూరు కలెక్టరేట్‌లో మత్స్యకారుల సంక్షేమంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సమస్యలపై చర్చించారు. జువ్వలదిన్నే తీర ప్రాంత సమస్యలు, మత్స్యకార సోదరుల జీవనోపాధి, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కారాలు చూపేలా చర్యలు చేపడతాముని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.